1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana govt. likely to release DSC notification tomorrow

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ... రేపు నోటిఫికేషన్

telangana state
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 11062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. నిజానికి బుధవారమే ఈ నోటిఫికేషన్ విడుదలకావాల్సివుంది. కానీ, డీఎస్సీ షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు మెరుగులుల దిద్దాల్సి ఉండటంతో ఒక రోజు ఆలస్యంకానుందని అధికారులు తెలిపారు. 
 
మొత్తం 11062 పోస్టుల్లో 6500 పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే ఉన్నాయి. ఈ మెగా డీఎస్పీపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్నారి. వీళ్ళంతా మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసమే పకడ్బంధీగ సాఫ్ట్‌వేర్‌‍ను రూపకల్పన చేస్తున్నారు. 
తర్వాతి కథనం
మార్చి 2న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన