1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (20:51 IST)

31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్ష సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత

new Parliament
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి జరుగనున్నాయి. దీంతో గత శీతాకాల సమావేశాల్లో విపక్ష సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఎత్తివేశారు. గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. అనూహ్యరీతిలో చొరబడిన వ్యక్తులు సభలోకి దూసుకొచ్చారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న 14 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై ఇపుడు సస్పెన్షన్ ఎత్తివేశారు. 
 
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతోనూ, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్‌తో చర్చించారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున కోరడంతో అందుకు వారు అంగీకరించారు. 
 
దీంతో నిర్ణయంతో రాజ్యసభలో 11 మంది ఎంపీలపై, లోక్‌సభలో ముగ్గురు ఎంపీలపై విధించిన సస్పెన్షన్ తొలగిపోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులోకి అగంతకులు చొరబడిన ఘటనలో సదరు ఎంపీలు సభల తీవ్ర ఆందోళనకు దిగడంతో వీరిని సస్పెండ్ చేశారు.