గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (11:31 IST)

ఏదైనా అతిగా వినియోగించడం మంచిది కాదు.. విద్యార్థులకు ప్రధాని హితవు

narendra modi
ఒదైనా ఒక వస్తువును అతిగా వినియోగించడం ఏమాత్రం మంచింది కాదని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హితవు పలికారు. సోమవారం జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏదైనా అతిగా వినియోగిస్తే మంచిది కాదని... కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ మొబైల్ వెంట పడకూడదని సూచించారు. 
 
అవసరం ఉంటేనే తాను మొబైన్‌ను కూడా వినియోగిస్తానని లేకుంటే దాని జోలికే వెళ్ళనని తెలిపారు. విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లలో స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్స్‌ను ఉపయోగించాలన్నారు. సమయాన్ని గౌరవించాలని.... మొబైల్స్ చూస్తూ సమయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. 
 
పిల్లల ఫోన్ల పాస్ వర్డ్‌ను తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరం జరగకూడదని... అదేసమయంలో సానుకూల ప్రభావం చూపేలా మాత్రమే ఉపయోగించాలని, చెడుగా వినియోగించరాదని కోరారు. 
 
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొంతమంది పాల్గొనగా... ఆన్‌లైన్ ద్వారా కోట్లాది మంది వీక్షించారు.