సంబంధిత వార్తలు
- కేసీఆర్ పుట్టిన తరువాతే అబద్దం, మోసం పుట్టాయి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- వివాహితతో రసపట్టులో బస్సు డ్రైవర్, రాడ్డుతో బెడ్ పైన వున్నవాణ్ణి వున్నట్లే చావబాదారు
- సీఎం సార్‌ని నిలదీయాటానికే తెలంగాణలో కొత్త పార్టీ.. వైఎస్ షర్మిల క్లారిటీ
- లోకేష్‌కు కేసీఆర్ ఫోన్...ఎందుకో తెలుసా?
- ఆ పబ్‌లు, క్లబ్‌ల యాజామాన్యాలపై కఠిన చర్యలు : సజ్జనార్
సిద్దిపేటలో ‘స్వచ్ఛబడి ’
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణీతం, సైన్సు, సోషల్ సబ్జెక్టుల గురించి పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. కానీ చెత్త సేకరణ, ప్రజారోగ్యం, తడి,పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నివారణ, చెత్తతో ఇళ్లలోనే ఎరువు తయారీ చేసే విధానాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సిద్దిపేట లోని స్వచ్ఛబడికి వెళ్లాల్సిందే.
ఆ దిశగా మంత్రి హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత మన సిద్దిపేటలోనే స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. త్వరలోనే చెత్త గురించిన పాఠాలు చెప్పనున్నారు. పాత ఎంసీహెచ్(మెటర్నిటీ) ఆస్పత్రిలో అన్ని హంగులతో ఈ బడిని ఏర్పాటు చేయడం జరిగింది.
అన్ని వర్గాల వారికి ఇక్కడ డిజిటల్ క్లాసుల్లో పాఠాలు బోధించి, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా వివరిస్తారు. మంత్రి హరీశ్‌రావు గారి చొరవతో బెంగళూరుకు చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త శాంతి గారు ఈ స్వచ్ఛబడిని పర్యవేక్షిస్తున్నారు.రేపు మంత్రి హరీష్ రావు గారు స్వస్ పాఠశాలను ప్రారంభించనున్నారు.
