సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:42 IST)

ఆ పబ్‌లు, క్లబ్‌ల యాజామాన్యాలపై కఠిన చర్యలు : సజ్జనార్

‘‘కొంత మంది నిర్లక్ష్యం వల్ల వేలాది కుటుంబాలకు కరోనా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై  నేనే రంగంలోకి దిగుతా. పబ్‌లు, క్లబ్‌లను ఆకస్మికంగా పర్యవేక్షిస్తా. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న యాజామాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అన్నారు సీపీ సజ్జనార్‌.

‘‘నేను మాస్క్‌ ధరిస్తే నీకు రక్షణ, నువ్వు మాస్క్‌ ధరిస్తే నాకు రక్షణ, ఇలా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం దేశానికే రక్షణ’’ అని సీపీ సజ్జనార్‌ అన్నారు. గచ్చిబౌలి కమిషనరేట్‌లో ఆయన మాట్లాడారు.

కరోనా నిబంధనలు పాటించేవారు దేశభక్తులన్నారు. మాస్కులను పట్టించుకోని దుకాణదారులపైన, వినియోగదారులపైన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.