ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (20:15 IST)

రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన పెద్దిరెడ్డిపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలి: గోరంట్ల బుచ్చయ్యచౌదరి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగబద్ధ సంస్థఅయిన ఎన్నికల కమిషన్ ను బెదిరించడం, ఎస్ఈసీకి సహకరించే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించడమనేది రాజ్యాంగ ధిక్కరణే అవుతుందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టంచేశారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోవడం పెద్దిరె డ్డికి పరిపాటిగా మారిందని, గతంలో ఎస్ఈసీ సమావేశాలకు అధికారులు వెళ్లకుండా మంత్రి అడ్డుకున్నాడన్నారు.

ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవన్న బుచ్చయ్య, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడంద్వారా వైసీపీనేతలు నియంత పోకడలకు పోతున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే బలవంతపు ఏకగ్రీవాలను ఏకపక్షంగా ఆమోదించకుండా, అన్నీ పరిశీలించి, విచారించాకే వాటినిప్రకటించాలని ఎస్ఈసీ చెప్ప డం జరిగిందన్నారు.

మంత్రిపెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఏకగ్రీవాలకోసం అధికారులను, పోలీసులను చేతిలో పెట్టుకొని నియంతలా వ్యవహరిస్తున్నాడన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో జరిగే ఏకగ్రీవాలపై అధికారులు దృష్టిసారించాలని ఎస్ఈసీ చెబితే, పెద్దిరెడ్డికి వచ్చినబాధేమిటో చెప్పాలన్నారు.

గతంలో ప్రధాన ఎన్నికల సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిపై, ప్రతిపక్ష వైసీపీఅనేకఫిర్యాదులు చేయడంజరిగిందని, దానితోపాటు ఆనాడు సీఎస్ గా ఉన్న అనిల్ చంద్రపునేఠా, డీజీపీ ఆర్.పీ.ఠాకూర్, ముగ్గురు ఎస్పీలు, ఇద్దరు కలెక్టర్లను మార్చాలని ఫిర్యాదుకూడా చేయడం జరిగిందన్నారు.

కానీ ఆనాడువైసీపీ ఆవిధంగా వ్యవహరించినా చంద్రబాబు నాయుడుగానీ, టీడీపీప్రభుత్వంలోని మంత్రులుగానీ ఒక్కటంటే ఒక్కమాటకూడా అనలేదన్నారు. ఎస్ఈసీ నిఘాయాప్ తయారు చేస్తే, ప్రభుత్వం దాన్ని తప్పుపట్టడం ఏమిటన్నారు. 

ప్రజల సొమ్మంతా రంగులకు, పనికిరాని వాహనాలకొనుగోలుకు ఖర్చు చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని గోరంట్ల నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి తనముల్లేదో ఖర్చుచేస్తున్నట్లు ఎందుకు మితి మీరి ప్రవర్తిస్తున్నాడన్నారు? ప్రభుత్వసొమ్ముని దోపిడీచేయడం, ఆఖరికి పిల్లలకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, బ్యాగుల పై కూడా రంగులేసుకోవడం ఏంటన్నారు.

మంత్రిపెద్దిరెడ్డి అవినీతికి అంతేలేకుండా పోయిందని, ఇసుక, మద్యంసహా, అనేక వ్యవహారా ల్లో ఆయన అందినకాడికి దోచేస్తూకూడా, అధికారులను బెదిరించ డమేంటని టీడీపీనేత మండిపడ్డారు. రాజ్యాంగబద్ధసంస్థని వ్యతిరే కించి, దానిచర్యలను తప్పుపట్టిన మంత్రిపెద్దిరెడ్డిని గవర్నర్ తక్షణ మే మంత్రివర్గంనుంచి తొలగించాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.

పంచాయతీల్లో పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థులకు సరైన ధృవపత్రాలు ఇవ్వకుండా,అధికారుల సాయంతో వేధిస్తున్న ప్రభుత్వం, మరోపక్క తమప్రభుత్వానికి ఓటేయకుంటే పథకాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్ల సాయంతో గ్రామాల్లో బెదిరింపుల పర్వానికి తెరలేపిందన్నారు.  ఈ విధమైన విధానాలు, చర్యలు ప్రభుత్వానికే చేటుచేస్తాయనే వాస్తవాన్ని జగన్ అండ్ కో గుర్తుంచు కోవాలన్నారు.

భారీ దోపిడీతో, అవినీతి చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు తయారుచేసుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి భావితరాలు తప్పకుండా తెలుసుకుంటాయని, అటువంటి వ్యక్తులగురించి ప్రజలకుతెలిసేలా తనవంతు ప్రయత్నాలు చేస్తున్న పెద్దిరెడ్డి వంటి వారికిఅభినందనలు తెలియచేస్తున్నానని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.