సంబంధిత వార్తలు
- Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్
- Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్
- Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన
- Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న
- Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?
కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !
Dhanush As Deva poster
23 సంవత్సరాలుగా నటుడిగా అద్భుతమైన కృషి, అభిరుచి, అంకితభావంతో కూడిన ప్రయాణం స్ఫూర్తినిస్తూనే ఉందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. అయితే, దర్శకుడు కస్తూరి రాజా తన కుమారుడు వెంకటేష్ ప్రభును ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అతని మరో కుమారుడు సెల్వరాఘవన్ రాసిన స్క్రీన్ ప్లే ఆధారంగా, తుళ్ళువాడో ఇలామై అనే చిత్రంతో కొత్త హీరోని ప్రారంభించారు, అతనికి ... ధనుష్ అని పేరు పెట్టారు
ఆ ధనుష్ జాతీయస్థాయి నటుడిగా వెలుగొందాడు. ఇప్పుడు దేవగా హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇటీవలే ధనుష్, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో ఫస్ట్ సింగిల్ పోయిరా మామా రిలీజ్ అయి ట్రెండ్ స్రుష్టిస్తోంది. ధనుష్ స్వయంగా పాడిన వాయిస్ ఈ పాటకి మరింత ఫీల్ తీసుకొచ్చింది. అతని గాత్రంలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరినీ అలరిస్తూ, మాస్ టచ్‌కి తగిన రిథమిక్ మ్యాజిక్ ను అందించింది. శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ పాటను ఒక విజువల్ ట్రీట్ గా మలిచింది – ధనుష్ డాన్స్‌లో చూపిన స్పిరిట్, ఎనర్జీ, ఒరిజినాలిటీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ పాటలో విజువల్స్, వాయిస్, సాహిత్యం, కొరియోగ్రఫీ అన్నీ కలసి ఒక అద్భుత అనుభూతిని అందిస్తున్నాయి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ Pvt Ltd పతాకాలపై సునీల్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించబడింది హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది.
