మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 4 మార్చి 2025 (18:50 IST)

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Tamanna, vijay varma
Tamanna, vijay varma
నటి తమన్నా భాటియా, విజయ్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. వారు డేటింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ జంట  వైవాహిత జీవితంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. వారి ప్రేమ పై పలు వార్తలు కూడా వినిపించాయి. తొందరలో వారు వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. కాని బాలి వుడ్ కథనం  ప్రకారం, తమన్నా, విజయ్ వర్మ కొన్ని వారాల క్రితం తమ సంబంధాన్ని ముగించారట.
 
నివేదిక ప్రకారం, “తమన్నా భాటియా, విజయ్ వర్మ జంటగా వారాల క్రితం విడిపోయారు, కానీ వారు మంచి స్నేహితులుగా ఉండాలని యోచిస్తున్నారు. ఇద్దరూ తమ తమ,తమ  విధుల్లో  కష్టపడి పనిచేస్తున్నారు. ఈ జంట ప్రేమ ప్రయాణం ముగిసినప్పటికీ, వారు ఒకరినొకరు గౌరవించుకుంటారు  ఆరాధిస్తారని తెలిస్తోంది. 
 
కాగా, విడిపోయిన వార్త అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ  సెలబ్రిటీలు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తమన్నా,విజయ్ సంబంధం వారు మొదటిసారి కలిసి పనిచేసిన చిత్రం లస్ట్ స్టోరీస్ 2 విడుదల సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించింది.
 
సినిమా ప్రమోషన్ల సమయంలో, ఈ జంట చేయి చేయి కలిపి నడిచారు. అనేక బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు, చివరికి వారిని ప్రేక్షకుల అభిమానంగా మార్చారు. చివరకు, సంవత్సరాల తరబడి డేటింగ్ చేసిన తర్వాత, ఆ జంట విడిపోయినట్లు సమాచారం.