Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వార్తల్లో నిలిచింది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా ప్రకటించింది. వీరిద్దరూ చాలా సందర్భాల్లో పలు ఈవెంట్స్, పార్టీలకు జంటగా కనిపించారు. అలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ వచ్చింది. అయితే తాజాగా తమన్నా పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది.
"ప్రేమించబడడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం.. ఆసక్తికరంగా ఉండటమే. వేరే వాళ్ళు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా చూడాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి.." అంటూ ఓ పోస్టు పెట్టింది.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజంట్ ఈ స్టోరీ వైరల్ అవుతుండటంతో.. ఇప్పటికిప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది.. కొంప తీసి వర్మతో తమన్నా విడిపోయిందా? అంటూ రూమర్స్ మొదలైయ్యాయి.