2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?
తమన్నా భాటియా - విజయ్ వర్మ బాలీవుడ్‌లో పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్నారు. వీరు ప్రేమ గురించి ఊహాగానాలు నిజమైతే త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ జంట కలిసి స్థిరపడేందుకు తమ కలల ఇంటి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది.
2025 వారి వివాహం జరిగే అవకాశం వుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని తమ విలాసవంతమైన కలల ఇంటికి మారతారు. లస్ట్ స్టోరీస్ 2 విడుదలతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. త్వరలో వీరి పెళ్లి ప్రకటన వచ్చే అవకాశం వుందని టాక్. తమన్నా ఒదెలా 2లో నటిస్తోంది. విజయ్ వర్మ ఇటీవల IC814: ది కాందహార్ హైజాక్‌లో కనిపించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్క్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.."విజయ్ రాకతో నా లైఫ్ అంతా మారిపోయింది. తను పక్కనుంటే యావత్ ప్రపంచాన్నే గెలవగలను అనిపిస్తుంది. తన నిజాయితీ అంటే నాకిష్టం" అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.