1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I will play an aunt-like role in the film Attarintiki Daredi: Former Minister Roja

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

Roja
మాజీమంత్రి రోజా ప్రస్తుతం తనకు చాలా ప్రశాంతంగా వుందనీ, అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టగలుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఓ మీడియా ఛానల్‌తో ఆమె మాట్లాడారు. " నేను ఎన్నికల్లో గెలవలేదు కనుక నా వద్దకు ప్రజలు కూడా అంతగా రావడంలేదు. ఒకవేళ ఎవరైనా వస్తే నాకు చేతనైనంత సాయం చేసి పంపిస్తున్నాను. ఈరోజు నేను ఈ స్థాయిలో వుండటానికి ప్రధాన కారణం సినీ రంగమే. ప్రేక్షకుల ఆశీర్వద బలంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. గెలుపుఓటములు సహజమే. ఐతే నన్ను ఏ పార్టీకి చెందినవారైనా ఆప్యాయంగా పలుకరిస్తారు.
 
నేను ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయంగా మాట్లాడుతారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది. ప్రస్తుతం మరోసారి నటించాలని అనుకుంటున్నాను. ఐతే బాహుబలిలో శివగామి పాత్రలా, అత్తరాంటికి దారేది చిత్రంలో నదియ పాత్రలా పవర్ ఫుల్ అయితేనే నటిస్తాను. సాధారణ పాత్రలు చేయను'' అంటూ వెల్లడించారు.
 
తర్వాతి కథనం
ట్రజోన్ సోలార్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు