శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (22:06 IST)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

CBN Brother
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్‌మోహన్‌ నాయుడు అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. ఆదివారం ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరిగాయి. 
 
రామ్ మూర్తి నాయుడు 1994-1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా, రామ్‌మూర్తి నాయుడు కుమారుడు, ప్రముఖ నటుడు నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ రాశారు. ఇది ఎప్పటికీ పూడ్చలేని శోకం. శూన్యాన్ని మిగిల్చే నష్టమని మోదీ పేర్కొన్నారు. 
 
"ఒక ప్రజాప్రతినిధిగా, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆకాంక్షలు, సవాళ్లను తన గొంతుక ద్వారా వినిపించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. రామ్ మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. ఈ ఘోరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి అందించాలని ఆకాంక్షించారు.