ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (14:01 IST)

దుఃఖ సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : నారా రోహిత్

nara family
తమ ఇంట్లో జరిగిన విషాదకర ఘటన తర్వాత దుఃఖసాగరంలో మునిగిపోయిన తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హీరో నారా రోహిత్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, తమ సొంత పెదనాన్న చంద్రబాబు నాయుడుతో పాటు.. అన్న నారా లోకేశ్, సన్నిహితులను ఉద్దేశించి నారా రోహిత్ తాజాగా పోస్ట్ పెట్టారు. 
 
తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. క్లిష్ట సమయంలో పెదనాన్న, పెద్దమ్మ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి.
 
ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఞతలు అని రోహిత్ పోస్టులో పేర్కొన్నారు.