బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (15:01 IST)

పిల్ల చేష్టలొద్దు, ఆంధ్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లు, అసెంబ్లీకి వస్తే చూపిస్తా: చంద్రబాబు (video)

Chandrababu Naidu speach
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అప్పులు గురించి మేమేదో చెబుతున్నాం అని ఏదేదో చెబుతున్నారు వైసిపివాళ్లు అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్యోగస్తుల డబ్బును కూడా వాడేసుకున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి ఒక్క జీవోను ఆన్లైన్లో పెడుతున్నామని వెల్లడించారు. పిల్లచేష్టలు చేస్తూ... ఏదిబడితే అది మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం అప్పులు అక్షరాలా రూ. 9,74,556 కోట్లు అని గణాంకాలు వెల్లడించారు. బయట కూర్చుని ఏదేదో మాట్లాడవద్దనీ, అసెంబ్లీకి వస్తే మరింత వివరంగా అన్ని లెక్కలు చెబుతానంటూ వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల వివరాలు:
గవర్నమెంట్ అప్పు - రూ.4,38,278 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - రూ.80,914 కోట్లు
కార్పొరేషన్ అప్పు - రూ.2,48,677 కోట్లు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు -  రూ.36,000 కోట్లు
పవర్ సెక్టార్ అప్పు -  రూ.34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అప్పులు - రూ.1,13,244 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ అప్పు - రూ. 21,980 కోట్లు
నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అప్పు - రూ.1,191 కోట్లు.
 
ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు