బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (12:06 IST)

జగన్ అసెంబ్లీకి రాడని 11 రూపాయలు పందెం కాస్తున్నారు: హోంమంత్రి అనిత (video)

Anitha
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, వైసిపి ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరై తాము మాట్లాడాల్సినవి మాట్లాడవచ్చు, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవచ్చు అని అన్నారు హోంమంత్రి అనిత. ఆమె ఇంకా మాట్లాడుతూ... "నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు కూడా వచ్చి మాట్లాడొచ్చు.. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్‌లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు?
 
స్పీకర్ అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానున్న రఘురామరాజు గారు మీకు మైక్ ఇస్తారు, భయపడకుండా అసెంబ్లీకి రండి. రఘురామ రాజు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రారంటూ కొంతమంది రూ. 11 పందెం కాస్తున్నారు" అనిత అన్నారు. చూడండి వీడియోలో...