శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (10:27 IST)

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

Danush_Nayan
Danush_Nayan
ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ ధన్ చిత్రం బీటీఎస్ ఫుటేజీని ఉపయోగించడానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ నయనతార ధనుష్‌పై బహిరంగ లేఖ రాసింది.  నయనతార దానిని తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ, నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ కోసం ఉపయోగించాలని భావించింది. ఈ వివాదం యావత్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. 
 
దీనిపై ధనుష్ స్పందించి నయనతారకు లీగల్ నోటీసు ఇచ్చాడు. అయితే, ఈ అగ్లీ వివాదం మధ్య నయనతార, ధనుష్ ఒక నిర్మాత వివాహానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఒకే వరుసలో చెరో పక్క కూర్చున్నారు. చెన్నైలో జరిగిన ఆకాశ్ భాస్కరన్ వివాహానికి నయనతార, ధనుష్ హాజరయ్యారు. వారిద్దరూ ముందు వరుసలో కూర్చొని ఒకరినొకరు పట్టించుకోకుండా వుండిపోయారు. 
 
ఇకపోతే.. నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులను ఆహ్వానించారు. ఆయన ధనుష్ ఇడ్లీ కడై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్‌ల ఫేస్‌ఆఫ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.