బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (15:19 IST)

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

Dhanush-Aishwarya
విడాకుల కేసులో ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, హీరో ధనుష్‍‌ దంపతులు గురువారం చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. గత మూడు దఫాలపాటు జరిగిన విచారణకు ఆమె హాజరుకాలేదు. అలాగే, ఆమె భర్త, హీరో, దర్శక నిర్మాత ధనుష్ కూడా హాజరుకాలేదు. 
 
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్ అతని సతీమణి ఐశ్వర్య తాజాగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని విడిపొయేందుకు నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. 
 
ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇరువురి వాదనలు ఆలకించిన కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ధనుష్ - ఐశ్వర్య దంపతులు విడిపోవడం ఖాయమని తేలిపోయింది.