గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 నవంబరు 2024 (20:19 IST)

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

poonam kaur
నయనతార-ధనుష్ వివాదం ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. ధనుష్ చిత్రంలో కొన్ని సెకన్ల దృశ్యాలను వాడుకున్నందుకు కోట్లలో పరిహారం ఇవ్వాలంటూ ధనుష్ నోటీస్ పంపాడు. దీనితో నయనతార ఫైర్ అవుతోంది. దీనిపై సినీ ఇండస్ట్రీలో పలువురు తారలు నయనతారకు మద్దతుగా నిలుస్తున్నారు. వీరిలో పూనమ్ కౌర్ కూడా చేరిపోయింది.
 
ఐతే పూనమ్ కౌర్ పెట్టిన కామెంట్ పైన ఓ నెటిజన్ స్పందిస్తూ... నిర్మాత అయిన ధనుష్‌కి తన కంటెంట్ పైన హక్కు వుంటుంది కదా అని కామెంట్ చేసాడు. దీనితో పూనమ్ కౌర్ స్పందిస్తూ... త్రివిక్రమ్ కూడా కాపీ చేస్తుంటాడు, మరి దీనికి మీరు ఏం అంటారు అని పోస్ట్ పెట్టింది. దీనితో నెటిజన్లు కొందరు... ఎందుకమ్మా మాటిమాటికీ త్రివిక్రమ్ ను వివాదంలోకి లాగుతావు, అసలు ఏం జరిగిందో చెప్పవచ్చు కదా అని పోస్టులు పెడుతున్నారు.