గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (09:12 IST)

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

Dhanush, nagarjuna
Dhanush, nagarjuna
తాజాగా మహేష్ బాబు 'కుబేర' స్పెల్‌బైండింగ్ ఫస్ట్ గ్లింప్స్‌ ను ఆన్ లైన్ లో విడుదల చేశారు. గ్లింప్స్ ను చూస్తే స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ గా నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేరగా అనిపిస్తుంది. ఈ ముగ్గురు కనెక్టవిటీ ఏమిటి? అనేది సినిమాలో చూడాల్సిందే నని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలియజేస్తున్నారు.
 
ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు, సూపర్ స్టార్ మహేష్ బాబు హైలీ యాంటిసిపేటెడ్ కుబేర ఫస్ట్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు.  
 
ఫస్ట్ గ్లింప్స్ ని ప్రతి లీడ్ రోల్ పై క్యురియాసిటీ క్రియేట్ చేసేలా ప్రజెంట్ చేశారు. ధనుష్  స్లమ్స్ లో హంబుల్ లైఫ్ ని గడుపుతున్న వ్యక్తిగా పరిచయం అయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అతని ముఖంలో ఆనందంకనిపిస్తోంది. మరోవైపు, నాగార్జున తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్న  సక్సెస్ ఫుల్ మ్యాన్ గా కనిపించారు. జిమ్ సర్భ్  బిలియనీర్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడు,  రష్మిక మందన్న పాత్ర ఆమె మధ్యతరగతి జీవితంలో అసంతృప్తితో పోరాడుతున్నట్లు కనిపిస్తుంది, మరింత ప్రోగ్రస్ కోసం ఆరాటపడుతుంది.
 
ప్రతి పాత్రని వారి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ తో  పోరాడుతున్నట్లు ప్రజెంట్ చేశారు, గ్లింప్స్ పవర్ ఫుల్ మూమెంట్స్ ని అందిస్తోంది, ధనుష్ సంప్రదాయ తెల్లని లుంగీ, చొక్కా ధరించి కనిపించారు. అతని ముఖంలో అసంతృప్తి నోటీస్ చేయొచ్చు.
 
శేఖర్ కమ్ముల క్లవర్  కట్ మనకు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను రేకెత్తిస్తుంది. కథను ఎక్కువగా రివిల్ చేయకుండా పాత్ర పరిచయాలు, వారి ఎమోషనల్ ఆర్క్‌లపై దృష్టి సారిస్తుంది. ధనుష్, నాగార్జున, జిమ్ సర్భ్, రష్మిక మందన్న తమదైన ఎనర్జీని తెరపైకి తెస్తున్నారు.
 
విజువల్ గా కుబేర కట్టిపడేసింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్  బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఇంటెన్స్ అండ్ ఎనర్జిటిక్ లేయర్ ని యాడ్ చేసింది. అతని మ్యూజిక్ ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ వీడియో సినిమా యొక్క గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌ని తెలియజేస్తుంది.
 
మొత్తానికి, కుబేరు ఫస్ట్ గ్లింప్స్ ఎమోషనల్ డెప్త్, విజువల్  గ్రాండియర్ తో అదరగొట్టింది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, గ్రేట్ స్టొరీ టెల్లర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేరపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలని ఫస్ట్ గ్లింప్స్ మరింతగా పెంచింది.
 
శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కుబేర తమిళం, తెలుగు హిందీలలో రూపొందుతున్న మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్.