బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (08:04 IST)

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

kubera-Nag
kubera-Nag
కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న  క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.  తాజాగా నాగార్జునకు చెందిన మరో స్టిల్ విడుదలచేశారు. రియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్‌లో నాగార్జున ఖరీదైన సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్నట్లు కనిపించారు. అతని చుట్టూ సంపద ఉన్నప్పటికీ, అతని కళ్ళలోని ఎమోషన్ ఒక కాంప్లీకేట్ లైఫ్ ని చూపిస్తున్నాయి. ఈసారి సక్సెస్ కోసం అనేట్లుగా వుంది.
 
నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర' ఫస్ట్ గ్లింప్స్ ఈ నెల 15న విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్ నాగార్జునను మెలాంకోలిక్ లైట్‌లో ప్రజెంట్ చేస్తూ, క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్ పై అందరిలో ఆసక్తిని పెంచింది.  
 
శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర సస్పెన్స్ ఎలిమెంట్స్ తో గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 కుబేర షూటింగ్ పూర్తి కావొస్తోంది. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికే జరుగుతోంది. ఫస్ట్ గ్లింప్స్ తో పూర్తి స్వింగ్‌లో ప్రమోషన్స్ ని బిగెన్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది.
 కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.