సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

group photo
ఓ పారిశ్రామికవేత్త బర్త్‌‍డే పార్టీలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలు సందడి చేశారు. మాల్దీవుల్లో జరిగిన ఈ బర్త్ డే ఫోటోకి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబులతో పాటు రామ్ చరణ్, ఉపాసన, నమ్రతలు ముగ్గురు ఓ ఫంక్షనులో పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ర కథానాయకులు ముగ్గురూ ఒకే ఫ్రేమ్ కనిపిస్తుండటంతో ఆ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే వీరు ముగ్గురూ ఎవరు ఏర్పాటు చేసిన ఫంక్షనులో పాల్గొన్నారు. ఎక్కడ జరిగింది అన్న దానిపై చర్చ జరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు మరికొందరితో ఓ హోటల్లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండటం ఆ ఫోటోలో కనిపిస్తుంది.
 
అయితే, మాల్దీవులు వేదికగా ఓ వ్యాపార వేత్త తన పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ట్రీటు వీరంతా హజరయ్యారని సమాచారం. ప్రస్తుతం "విశ్వంభర" మూవీ షూటింగులో చిరంజీవి, కుబేర, కూలీ సినిమాల్లో నాగార్జున, రాజమౌళి దర్శకత్వంలోని చిత్రంలో మహేశ్ బాబు షూటింగ్స్ బిజీ బిజీగా ఉన్నారు. షూటింగులకు కాస్త విరామం ఇచ్చి వీరు సరదాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.