శుక్రవారం, 25 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జులై 2025 (17:25 IST)

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

pak drones
పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వుంది. వీటిని భారత సైనికులు ధీటుగా ప్రతిఘటిస్తున్నారు. అంతేకాకుండా, పాక్‌కు చెందిన ఆరు డ్రైన్లను కూడా కూల్చివేశారు.
 
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ సమీపంలో భారత్ - పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తుపదార్థాలు మన దేశంలోకి పంపించేందుకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పంపించిన ఆరు డ్రోన్లను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. ఈ ఘటనలో మూడు తుపాకులు, మ్యాగజీన్లతో పాటు ఒక కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. 
 
ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి అనుమానాస్పద వస్తువులు భారత్ భూభాగంలోకి వస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. అవి పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లుగా గుర్తించి వెంటనే ప్రతిస్పందించి వాటిని కూల్చివేసింది. 
 
మోథే సమీపంలో ఐదు డ్రోన్లను కూల్చిన బీఎస్ఎఫ్ మూడు తుపాకులు, మూడు మ్యాగజీన్‌లు, దాదాపు 1.07 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. గురువారం తెల్లవారుజామున అట్టారీ దాల్ గ్రామానికి సమీపంలో మరో డ్రోన్‌ను కూల్చివేశారు. వీటితో పాటు దాల్ స మీపంలోని పంట పొలాల్లో తుపాకీ విడిభాగాలు, ఒక మ్యాగజీన్‌ను గుర్తించారు.