మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (16:18 IST)

3 సెకన్ల క్లిప్ కోసం రూ. 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే? ధనుష్‌పై నయన ఫైర్

Dhaush_Nayanatara
Dhaush_Nayanatara
హీరో ధనుష్‌పై దుమ్మెత్తి పోస్తూ, అతడి నిజస్వరూపం ఇదే అంటూ 3 పేజీల బహిరంగ లేఖ ద్వారా దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్‌ని తప్పు బడుతూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది. 
 
నయనతార తన పెళ్లి, కెరీర్, లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే టైటిల్‌తో డాక్యుమెంటరీ చిత్రాన్ని నవంబర్ 18న రిలీజ్ చేస్తారు. 
 
ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ నుంచి విభేదాలు మొదలయ్యాయి. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని పాటకి సంబంధించిన 3 సెకండ్ల వీడియో ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. 
 
ఇక్కడే అసలు జగడం మొదలైంది. తన అనుమతి లేకుండా ఆ వీడియో ఉపయోగించడం ధనుష్‌కి ఏమాత్రం నచ్చలేదు. దీంతో నయనతారపై కోర్టులో ఏకంగా 10 కోట్ల రూపాయల కాపీ రైట్ కేసును నమోదు చేశాడు. కొన్ని రోజుల పాటు నయన్, ధనుష్ మధ్య ఈ వ్యవహారంలో చర్చలు జరిగినట్లు టాక్. రాజీ కుదరకపోవడంతో నయన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ధనుష్ పై ఏకంగా 3 పేజీల లేఖతో విరుచుకుపడింది. 
 
చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు పొందావు.. కానీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటం చేస్తూ తాను ఈ స్థాయికి ఎదిగాననే విషయాన్ని గుర్తు చేసింది నయనతార. ముందు నుంచే తనపై పగ వుందని తెలుసు. కానీ ఈ స్థాయిలో నీచ బుద్ధిని బయటపెడతావని అనుకోలేదు. తనకు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చిత్రం రిలీజ్ కోసం తన సన్నిహితులు, అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక చాలా మంది సాయం, కష్టం ఉంది. ఈ డాక్యుమెంటరీలో ఆ పాటను తొలగించలేని పరిస్థితి. 
 
"నా సినీ జీవితానికి సంబంధించిన క్లిప్స్, అనేక విషయాలు ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచాం. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు కూడా ఉంటాయి. కానీ నా కెరీర్ లో కీలకమైన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని క్లిప్స్ ని మాత్రం ఉపయోగించలేకపోయాం. దీని గురించి నిన్ను ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసినా రిజెక్ట్ చేశావు. ఇది నా మనసుని బద్దలయ్యేలా చేసింది. బిజినెస్ లెక్కలు వేసుకుని, నా పై ఉన్న కక్షతో నువ్వు కేసు వేశావు. నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి సంబంధించిన అన్ని క్లిప్స్ ని ఎడిటింగ్ లో తొలగించాం. నువ్వు అనుమతులు ఇవ్వలేదు కాబట్టి అలా చేయక తప్పలేదు. 
Danush_Nayan
Danush_Nayan
 
ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌లో ప్రత్యేకం. నా డాక్యుమెంటరీకి ఆ పాటలు బాగా సరిపోతాయి. కానీ తొలగించక తప్పలేదు. కేవలం షూటింగ్ మధ్యలో మొబైల్స్ లో తీసిన 3 సెకండ్ల క్లిప్ మాత్రం ఉపయోగించాం. అది కూడా బీటీఎస్ క్లిప్ మాత్రమే. 
 
మా మొబైల్స్‌లో చిత్రీకరించిన క్లిప్ అది. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థం అవుతోంది. నీ అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థం అయింది." అంటూ నయనతార కామెంట్లు చేసింది.