శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (19:26 IST)

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

Ramcharan
Ramcharan
మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పలుమార్లు బహిరంగంగా తన అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ ఎన్టీఆర్ 100 ఏళ్ల వేడుకలకు తడబడకుండా హాజరైన హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. మరికొన్ని సందర్భాల్లో చంద్రబాబును కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడారు.
 
ఇది సహజంగానే టీడీపీ క్యాడర్‌ను ఆకట్టుకుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ రంగస్థలంలోని సైకిల్ తొక్కే చిత్రంతో పాటు గేమ్ ఛేంజర్‌లో సైకిల్ తొక్కుతున్న చరణ్ ఫోటోను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చరణ్ టిడిపి పార్టీ గుర్తు అయిన సైకిల్ తొక్కే సీన్ వుంటే సెంటిమెంట్‌గా సినిమా సక్సస్సేనని టీడీపీ క్యాడర్ అంటోంది. కాగా గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న సంక్రాంతికి విడుదల కానుంది, డిసెంబర్ 21, 2024న డల్లాస్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయబడింది.