సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (13:50 IST)

సమంతకు కసి తీర్చుకునే సమయం వచ్చేసిందట, ఎవరిపైనో తెలుసా?

Samantha Ruth Prabhu
సమంత రూత్ ప్రభు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అదను వచ్చినప్పుడల్లా సెగలు రేపుతుంది. ఇటీవలే మలేసియాలోని ఓ జలపాతంలో బికినీలో ఫోజులిచ్చి అనంతమైన సంతోషంలో మునిగి వున్నానంటూ ట్యాగ్ కామెంట్ చేసింది. కాస్త మయోసైటిస్ అనారోగ్య సమస్య నుంచి బయటపడినట్లు కూడా తెలుస్తోంది. దీనితో ఇక సినిమాలపై ఫోకస్ పెట్టిందని చెప్పుకుంటున్నారు.
 
samantha ruth prabhu
కర్టెసి-ట్విట్టర్
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైన మాట్లాడుతూ వుండటంతో సమంతను పలువురు యంగ్ హీరోలు తమ సరసన నటించాలని సందేశాలు పంపుతున్నారట. ఐతే వారికి సమంత నో అని ముఖం మీదే సమాధానం చెబుతోందట. దానికి కారణం ఏంటంటే.. గతంలో తను విడాకులు తీసుకుని తీవ్రమైన ఆవేదనలో వున్నప్పుడు సదరు కుర్ర హీరోలు ఆఫర్లు ఇచ్చేందుకు ముఖం చాటేశారట. అందుకే ఇప్పుడు వారు అడిగితే నటించనని చెప్పేస్తుందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద సమంతకి అప్పటి కసి ఇప్పుడు తీర్చుకునే సమయం వచ్చిందని అనుకుంటున్నారు.