గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (14:48 IST)

విశ్వంభర ఆఫర్‌ను వదులుకున్న సమంత.. ఏం జరిగింది?

Samantha
Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుని సినిమాల్లో నటించేందుకు సిద్ధమని ప్రకటించింది. మయోసైటిస్ నుంచి కొద్దినెలల క్రితం కోలుకుని వుంటే పెద్ద సినిమాల్లో నటించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత మెగాస్టార్ చిరంజీవి నటించే విశ్వంభర సినిమా ఆఫర్‌ను వదులుకుందని టాక్ వస్తోంది. 
 
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం నిర్మాతలు ఈ సినిమాలో ఇతర హీరోయిన్లను ఎంపిక చేసే ముందు సమంత గురించి ఆలోచించినట్లు ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఆ సమయంలో సమంత ఆరోగ్యం అంతగా బాగోలేకపోవడంతో చివరకు త్రిషను హీరోయిన్‌గా ఎంచుకున్నారని టాక్ వస్తోంది.