శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (09:35 IST)

నేను సిద్ధమే.. అవకాశాలే రావడం లేదు : హీరోయిన్ సమంత

samanta
హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నటించేందుకి సిద్ధంగా ఉన్నప్పటికీ సినిమా అవకాశాలు రావడం లేదని అన్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయిన తర్వాత నటనకు గత కొంతకాలంగా దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వ్యాధి నుంచి ఆమె కోలుకున్నారు. దీంతో తిరిగి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 
 
ఇందులోనే తన ఆరోగ్య పరిస్థితిని కూడా వెల్లడించారు. త్వరలోనే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్ 'సిటాడెల్' తర్వాత సమంతకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. అమెరికాలో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇన్‌స్టా స్టోరీలతో టైంపాస్ చేస్తుంది. ఆమె 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. దీంట్లో వరుణ్ ధావన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. విదేశీ చిత్రం చెన్నై స్టోరీస్‌లో కూడా నటించేందుకు ఆమె సంతకం చేసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.