శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (09:24 IST)

ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగిని కరిచిన ఎలుక.. ఎక్కడ?

rat bite
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన జరిగింది. మెదకుడు సంబంధించిన  సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్‌ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచింతి. చేతివేళ్లు, కాళ్లను ఎలుక కొరకడంతో గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్శింహా వెంటనే స్పందించారు. వైద్య విధాన పరిషత్ కమిషన్ డాక్టర్ అజయ్ కుమార్‌ను విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి హుటాహుటిన కామారెడ్డికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికెళ్లి పరిశీలించారు. 
 
ఐసీయూ వార్డులో రోగి చికిత్స పొందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలుక కరిచిన ఆనవాళ్లను, ఎలుకలు, ఐసీయూ వార్డులోకి ఎలా వచ్చాయని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడి భా్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత రికార్డులను పరిశీలించిన ఆయన స్థానిక మీడియాకు వెల్లడించారు. అయితే, విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన వింటే ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకునేలా ఉంది. 
 
వారం రోజులుగా బాధితుడు కోమాలోనే ఉన్నారు. స్పృహలో కూడా లేరని చెప్పారు. ఐసీయూ వార్డులోకి ఎలుకలు రావడానికి స్థానికంగా జరుగుతున్న నిర్మాణ పనులు, రోగి బంధువులు తిని పడేసిన అన్నం మెతుకులే కారణమని చెప్పారు. దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యాన్ని రోగులకు ఆపాదిస్తూ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ఇచ్చిన వివరణకు అందరూ ఆశ్చర్యపోయారు.
 
కాగా, రోగిని ఎలుక కరిచిన ఘటనపై కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించగా.. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ త్రివేణి నలుగురిపై చర్యలు తీసుకున్నారు. వైద్యురాలు కావ్య, ఇన్‌చార్జి జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడు సంపత్‌కుమార్‌, స్టాఫ్‌నర్స్‌ మంజులను సస్పెండ్‌ చేయగా, సూపరింటెండెంట్‌ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.