మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (13:49 IST)

మలయాళ స్టార్ మమ్ముట్టితో సమంత ఏం చేస్తోంది?

Samantha with Mammootty
Samantha with Mammootty
మలయాళ స్టార్ మమ్ముట్టితో స్టార్ హీరోయిన్ సమంత పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని సామ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. యశోద నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా అప్డేట్స్ షేర్ చేస్తూ వుంటుంది. 
 
తాజాగా ఓ స్పెషల్ ఫోటోను సామ్ షేర్ చేసింది. అందులో సమంత మమ్ముట్టితో కలిసి ఫోటోకు ఫోజులిచ్చింది. ఈ పిక్ తనకు చాలా ఇష్టమైందని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్‌లో మమ్ముట్టి కామ్ లుక్‌లో కనిపించాడు. సమంత మాత్రం తన అభిమాన తార పక్కన నిలబడి ముఖంపై నవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా కనిపిస్తుంది.  
 
మరోవైపు సమంత సినీ ఇండస్ట్రీలో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఎంచక్కా ఈ హాలీడేస్‌ను విదేశాలలో గడిపింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌, దర్శకుడు రాజ్ - డికె సిటాడెల్: ఇండియాలో సమంత కనిపించనుంది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.