1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Bengaluru Lady Constable Goes Beyond Duty, Breastfeeds Abandoned Newborn!

ఆమె గొప్ప తల్లి.. త్వరలోనే కలుస్తాను : సీఎం కుమార స్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ మహిళను గొప్ప తల్లిగా అభివర్ణించారు. "అమ్మా నీకు వందనం. నీవు గొప్ప తల్లివి.. నిన్ను త్వరలోనే కలుస్తా"నంటూ ట్వీట్ చేశారు.

Bengaluru Lady Constable
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ మహిళను గొప్ప తల్లిగా అభివర్ణించారు. "అమ్మా నీకు వందనం. నీవు గొప్ప తల్లివి.. నిన్ను త్వరలోనే కలుస్తా"నంటూ ట్వీట్ చేశారు. 
 
ఇంతకు ముఖ్యమంత్రి కుమార స్వామి ఆ మహిళను అంతగా ప్రశించడానికి గల కారణాలేంటో పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్‌. పేరు అర్చన. అయితేనేం.. అమ్మగా స్పందించి ఓ అనాథ బిడ్డకు స్తన్యమిచ్చింది. ఆ బిడ్డ ప్రాణాలు కాపాడింది.
 
బెంగళూరు శివారులో ఉన్న భవనం వద్ద ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన బిడ్డను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు చిన్నారిని స్టేషన్‌కు తరలించారు. శిశువు పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో.. మూడు నెలల బాలింత అర్చన పాలిచ్చింది. 
 
ఓ తల్లిగా స్పందించి ఆ శిశువు ప్రాణం కాపాడింది. ఈ విషయాన్ని పోలీసులు ఫోటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఆమెను నెటిజన్లు అభినందలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా అర్చనను ప్రశంసించారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
తెరాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్... ఎందుకు?