శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (12:22 IST)

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది. విజయపుర ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం పెద్దసంఖ్యలో రోగులు వచ్చిపోతుంటారు. 
 
వీరికి వైద్యం అందించాల్సిన వైద్యులు నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి పేకాట ఆడారు. రోగులను విస్మరించి వైద్యులు, నర్సులు పేకాట ఆడుతున్న వైనం సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది. దీంతో విధులు మరచిపోయి పేకాట ఆడిన వైద్యులు, నర్సుల ఘటనపై దర్యాప్తు జరిపించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.