బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (12:59 IST)

ముజఫర్ నగర్: పాము కరిచింది.. తెలియక చిన్నారికి పాలుపట్టింది..?

ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు.

ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. పాముకాటుకు గురైన మహిళ తన రెండేళ్ల కుమార్తెకు పాలు పట్టడంతో.. చిన్నారి కూడా తల్లితో పాటు మృతిచెందిది. ఈ సంఘటన గురువారం సాయంత్రం మాండ్ల గ్రామంలో జరిగింది. మాండ్ర గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట నిద్రపోతుండగా.. ఒక విషపు పాము ఆమెను కాటేసింది. 
 
దీన్ని గమనించక తన పని తాను చేసుకుంటూ పోయిన మహిళ.. ఆ రెండేళ్ల పాపకు పాలు పట్టింది. పోలీసులు చెప్పిన ప్రకారం, తల్లీకూతురు ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వారి పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వారి మరణించినట్లు నిర్ధారించారు. పాము కాటేసిన విషయం ఆ మహిళకు తెలియకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని.. నిద్రలో పాము కరిచిన విషయాన్ని ఆమె గమనించలేదని పోలీసులు తెలిపారు.