బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 20 మే 2018 (15:13 IST)

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. భోజ్‌పురి నటి మనీషా మృతి..

ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి ప్రాణాలు కోల్పోయింది. ఉత్త్రప్రదేశ్ రాష్ట్రంలో బల్లియాలోని చిట్టౌని గ్రామంలో సహనటుడు సంజీవ్‌ మిశ్రాతో కలిసి వెళుతున్న హీరోయిన్ మనీషా మృతి చ

ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి ప్రాణాలు కోల్పోయింది. ఉత్త్రప్రదేశ్ రాష్ట్రంలో బల్లియాలోని చిట్టౌని గ్రామంలో సహనటుడు సంజీవ్‌ మిశ్రాతో కలిసి వెళుతున్న హీరోయిన్ మనీషా మృతి చెందారు. షూటింగ్ నిమిత్తం స్నేహితుడు, నటుడు సంజీవ్‌ మిశ్రాతో మనీషా వెళుతుండగా మార్గం మధ్యలో వెనకాలే వస్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. 
 
దీంతో వెనుక సీటులో కూర్చున్న మనీషా తీవ్రగాయాలతో మృతి చెందింది. ఇక మిశ్రా గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సాయంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే డ్రైవర్‌ను పట్టుకుంటామని ఎస్పీ ఎస్‌పీ గంగూలీ తెలిపారు. మనీషా రాయ్ మృతి విషయం తెలిసి భోజ్‌పురి చిత్రసీమలో విషాదం నెలకొంది. పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.