మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:52 IST)

లారీ ఢీకొట్టడంతో ఎగిరిపడ్డాడు.. అయినా ఏం కాలేదు

గుజరాత్‌లో ఒళ్లు గగుర్పాటు కలిగే సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ లారీ ఢీకొంది. లారీ ఢీకొన్న వ్యక్తి ఎగిరిపడ్డాడు. అయితే చిన్న గాయం కూడా తగలకుండా తప్పించ

గుజరాత్‌లో ఒళ్లు గగుర్పాటు కలిగే సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ లారీ ఢీకొంది. లారీ ఢీకొన్న వ్యక్తి ఎగిరిపడ్డాడు. అయితే చిన్న గాయం కూడా తగలకుండా తప్పించుకున్నాడు. అంతేగాకుండా ప్రమాదం తర్వాత మామూలుగా నడుచుకుంటూ ప్రమాదానికి గురైన వ్యక్తి నడుచుకుంటూ వెళ్లాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రోడ్డు దాటేందుకు ఓ వ్యక్తి ఎడమవైపు నుంచి ఏవైనా వాహనాలు వస్తున్నాయా అంటూ చూశాడు. కానీ కుడివైపున వస్తున్న వాహనాన్ని మాత్రం చూసుకోలేదు. ఇంతలో డంపర్ లారీ ఒక్కసారిగా అతనిని బలంగా ఢీకొట్టింది. 
 
దీంతో రోడ్డు దాటుకునే వ్యక్తి ఎగిరిపడ్డాడు. అయినా ప్రమాదం నుంచి చిన్న గాయంతో బయటపడ్డాడు. తర్వాత ఏమీ కానట్లు రోడ్డు దాటుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.