మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 మార్చి 2018 (14:15 IST)

రోడ్డు ప్రమాదం... కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృత్యువాత

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు ఒకవైపు, అతివేగం మరోవైపు... ఈ రెండూ కలిసి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. పెళ్లి బృందంతో బయలుదేరిన ఇన్నోవా వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే వున్న చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో పెళ్లి కుమారుడు కూడా వున్నాడు.

 
తణుకులో గత రాత్రి వివాహం జరిగింది. పెళ్లి ముగించుకుని వరుడు సొంత ఊరు వరంగల్ వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా వర్దన్నపేట వాసులు. కాగా పెండ్లి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.