శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (20:21 IST)

కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్తాం: మావో చీఫ్ జగన్

కేంద్రంపై పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రంతో మిలాఖతై ప్రజలపై ముఖ్యంగా ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్న తెలంగాణ సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోయిస్టు పార్టీ త

కేంద్రంపై పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రంతో మిలాఖతై ప్రజలపై ముఖ్యంగా ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్న తెలంగాణ సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతూ.. మావో పార్టీ నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్తామని జగన్ తెలిపారు. 
 
నియంత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నీళ్లు, భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే మావోయిస్టు పార్టీపై దుర్మార్గమైన దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఇకపై టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తామని ప్రకటించారు. ప్రజల సహకారంతో పోలీసుల వ్యూహాలను సమర్థవంతంగా తిప్పికొడతామని జగన్ స్పష్టం చేశారు. చర్ల ఎన్‌కౌంటర్‌పై జగన్ స్పందిస్తూ.. మావోయిస్టులు సేదతీరుతున్న సమయంలో దాడి చేశారని జగన్ అన్నారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన ఆడియో లీకైందని సమాచారం.