సంబంధిత వార్తలు
- బీజేపీతో పొత్తు ఉండదు... తెగదెంపులే : సంకేతాలిచ్చిన చంద్రబాబు
- మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?.. ప్రధాని మోడీకి కేసీఆర్ ప్రశ్న
- సీఎం కేసీఆర్ హత్యకు ప్లానా? తప్పిన పెను ప్రమాదం
- శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం అసాధ్యం: సుబ్రహ్మణ్య స్వామి
- కర్నూలును రెండో రాజధానిగా చేయండి : బీజేపీ నేతల డిమాండ్
కేసీఆర్.. ఓ దద్దమ్మ : బండారు దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఓ దద్దమ్మ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఓ దద్దమ్మ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఇటీవల కేసీఆర్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, రూ.లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.10 వేల కోట్లు కూడా కేటాయించలేని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై బండారు దత్తాత్రేయ స్పందించారు. దేశంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి మంత్రులు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే... కేంద్ర మంత్రులు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాకే దేశంలో రైతులు పచ్చగా ఉన్నారనీ తెలిపారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసే ఏకైక ప్రభుత్వం బీజేపీ సర్కారు అని బండారు చెప్పుకొచ్చారు. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు.
