గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 14 మే 2018 (12:54 IST)

రోజురోజుకీ ముదురుతోన్న వ‌ర్ల రామ‌య్య వివాదం... విద్యార్థి తల్లి ఆవేదన(video)

ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య ఓ విద్యార్థిని కులం పేరుతో తిట్ట‌డం.. నీకు చ‌దువు ఏం వ‌స్తుందిలే అని అంద‌రి ముందు తిట్ట‌డం వివాద‌స్ప‌దం అవ్వ‌డం తెలిసిందే. ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా వ‌ర్ల రామ‌య్యపై ఫైర్ అయ్యారు. అయితే... వర్ల ర

ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య ఓ విద్యార్థిని కులం పేరుతో తిట్ట‌డం.. నీకు చ‌దువు ఏం వ‌స్తుందిలే అని అంద‌రి ముందు తిట్ట‌డం వివాద‌స్ప‌దం అవ్వ‌డం తెలిసిందే. ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా వ‌ర్ల రామ‌య్యపై ఫైర్ అయ్యారు. అయితే... వర్ల రామ‌య్య అసభ్యంగా తన కుమారుడిని తిట్టాడు అంటూ కుర్రాడి త‌ల్లి ర‌జ‌నీ కన్నీటి పర్యంతం అవుతోంది. 
 
నా కుమారుడు బాగా చదువుతాడు.. అనేక మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్ వచ్చాయి. అవేమీ తెలుసుకోకుండా వర్ల రామయ్య నా బిడ్డను అందరిలో ఇష్టారాజ్యంగా తిట్టాడు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. ఆ వీడియోలన్నీ మీడియా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 
 
మా పరువు పోయింది. మూడు రోజుల నుంచి నా బిడ్డ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. అన్నం తినటం లేదు. కులం పేరుతో తిట్టి మా జాతిని అవమానపరిచారు. మా కులంలో పుట్టిన‌వాళ్లు విదేశాలకు వెళ్లారు, డాక్టర్లు అయ్యారు. వర్ల మాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం అని ర‌జ‌నీ తెలియ‌చేసారు. మ‌రి.. వ‌ర్ల క్ష‌మాప‌ణ చెబుతారో..? లేదో..? చూడాలి. విద్యార్థి తల్లి ఆవేదన చూడండి...