శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (09:58 IST)

ఏమయ్యా వర్లా.. నీవూ ఓ దళితుడివే కదా!.. చంద్రబాబు ఆగ్రహం

తన ఆకస్మిక పర్యటనలో దళిత యువకుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మెన్ వర్ల రామయ్యపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఒక దళిత నేతగా ఉండి.. సాటి దళిత

తన ఆకస్మిక పర్యటనలో దళిత యువకుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మెన్ వర్ల రామయ్యపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఒక దళిత నేతగా ఉండి.. సాటి దళిత యువకుడి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గురువారం కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనను పట్టించుకోని ఓ ప్రయాణికుడిని చీవాట్లు పెట్టారు. నువ్వు ఎస్సీనా? ఎస్టీనా? అంటూ రామయ్య అడగడం, ఏ కులమని ప్రశ్నించడం, మాలా? మాదిగా? అనడం, ఆపై రాయడానికి వీలులేని బూతులు వాడటాన్ని టీవీల్లో ప్రసారమయ్యాయి. 
 
వీటిని చూసిన చంద్రబాబు, వెంటనే వర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళిత నేత అయ్యుండి విద్యార్థిపై ఈ వ్యాఖ్యలేంటని మండిపడ్డ ఆయన, పార్టీ పరువును బజారులో పెట్టవద్దని హెచ్చరించినట్టు సమాచారం. వర్ల వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ తరహా ఘటనలను తాను సహించబోనని హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వర్లపై విపక్ష నేతలతో పాటు దళిత సంఘాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. జరిగిన ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించాయి.