శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (14:38 IST)

పెట్రోల్‌పై రూ.8 డ్యూటీ తగ్గించారు.. రూ.8 రహదారి సెస్సు విధించారు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తన మాటలగారడితో మరోమారు దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్ల

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో తన మాటలగారడితో మరోమారు దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నట్టు విత్తమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
అంటే, 'పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 2 రూపాయల బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నాం. మరో రూ.6 అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తొలగిస్తున్నాం' అంటూ ప్రకటన చేశారు. దీంతో పెట్రో ధరలు తగ్గుతాయని, కాస్తయినా ఊరట లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఇంతలోనే అసలు లోగుట్టు బయటపడింది. అదేసమయంలో రహదారి సెస్సును కొత్తగా ప్రవేశపెట్టారు. ఫలితంగా లీటరుకు రూ.8 చొప్పున 'రహదారి సెస్సు' విధించింది. అంటే ఆ తగ్గింపులు, ఈ పెంపుతో లెక్క సమానం చేశారు.