శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (16:54 IST)

శ్రీవారి చిన్న లడ్డూ ధర రూ.100కి పెరగనుందా?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 25 రూపాయలున్న లడ్డూను 50 రూపాయలు చేస్తే ఆ లడ్డూ ధర మరో 50 రూపాయలు పెంచి.. రూ.100కి పెంచే ఆలో

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 25 రూపాయలున్న లడ్డూను 50 రూపాయలు చేస్తే ఆ లడ్డూ ధర మరో 50 రూపాయలు పెంచి.. రూ.100కి పెంచే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు వడ ధర రూ.100లు కాగా.. రూ.150కి పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక కళ్యాణోత్సవ లడ్డూ రూ.200 రూపాయలుంటే ఆ ధరను రూ.400కి పెంచే ఆలోచనలో టీటీడీ అధికారులు వున్నారు. 
 
తిరుమలలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈఓ, జెఈఓ శ్రీనివాసరాజులు ప్రసాదాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. పాలకమండలి లేకపోవడంతో టిటిడి ఉన్నతాధికారులే ధరను పెంచే ఆలోచనలో ఉన్నారు. ధరను పెంచడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు. ఇప్పటికే చిన్న లడ్డూను తయారుచేయాలంటే రూ.37 ఖర్చవుతోంది. ఈ లెక్కన అయితే లడ్డూ కోసం 300కోట్ల రూపాయలు యేటా అధికంగా ఖర్చవుతోంది టిటిడికి. 
 
అందుకే ఈ భారాన్ని తగ్గించేందుకు టిటిడి ఉన్నతాధికారులు ప్రసాదాల రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నారు. ధర పెంచినా సరే భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకోనున్నారు టిటిడి ఉన్నతాధికారులు.