1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. When rape is inevitable, enjoy it, Karnataka Congress MLA controversy comment in Assembly

అత్యాచారం అనివార్యమైతే ఆనందంగా ఆస్వాదించండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే

rape
బెలగావిలో జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఆర్ రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మాజీ స్పీకర్ కుమార్, స్పీకర్‌తో ఇలా అన్నారు, “ఒక సామెత ఉంది… అత్యాచారం అనివార్యమైనప్పుడు, పడుకుని ఆనందించండి. మీరు ఉన్న స్థానం సరిగ్గా అదే." దానికి సమాధానంగా స్పీకర్ కాగేరి నవ్వాడు.
 
 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనం ఉలిక్కిపడ్డారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను సమయం కోరడంతో కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్య చేశారు.


దీనిపై స్పందించిన కాగేరి.. అందరికీ సమయం కేటాయిస్తే సెషన్‌ను ఎలా నిర్వహిస్తారని సభ్యులను ప్రశ్నించారు. సభ్యులు సొంతంగా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ, మాజీ స్పీకర్ కుమార్ వైపు చూసి, “నేను భావిస్తున్నాను, పరిస్థితిని ఆస్వాదిద్దాం. నేను దీన్ని అదుపులో ఉంచుకోలేను, దానిని క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లలేను.'' అని అన్నారు.
 
 
 
దీనిపై స్పందించిన కుమార్ లేచి నిలబడి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ పదాల వినియోగాన్ని కుమార్ వ్యాఖ్యలను వ్యతిరేకించాల్సింది పోయి స్పీకర్ దానిని ఆస్వాదిస్తూ నవ్వారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో, కుమార్ క్షమాపణలు చెప్పారు, “‘రేప్!’ గురించి చిన్నచూపు లేదా జోక్ చేయడం నా ఉద్దేశ్యం కాదు! కానీ సభలో పరిస్థితి మరీ దిగజారిపోయిందంటే ఆ సారూప్యతను వాడుకున్నాను, నోరు జారాను. ఇకపై భవిష్యత్తులో నా మాటలను జాగ్రత్తగా ఆచుతూచి మాట్లాడతాను.” అన్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
కోడలిని హెలికాఫ్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన అత్తింటివారు... ఎక్కడ?