మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (17:28 IST)

సామూహిక అత్యాచారం కేసులో ఐదురికి జీవిత ఖైదు

అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం కదరగుట్టపల్లి గ్రామంలో ఏడేళ్ల కిందట ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు మరియు చెరో 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ అనంతపురం నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు తీర్పు వెలువరించారు.

పెద్దవడుగూరు మండలం కదరగుట్ట పల్లికి చెందిన ఓ మహిళపై 2014 మే నెలలో కిష్టపాడు గ్రామానికి చెందిన బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విజువల్స్ కూడా చిత్రీకరించారు.

ఆ చిత్రాలను కిష్టపాడుకు చెందిన నల్లబోతుల శివ కృష్ణమూర్తి, బోయ రామాంజినేయులలకు పంపి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈమేరకు... పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

అప్పటి పామిడి సి.ఐ అశోక్ రెడ్డి దర్యాప్తు చేపట్టి ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అనంతపురం కోర్టు నందు విచారణ కొనసాగింది. ఈనేపథ్యంలో సదరు కోర్టు జడ్జి బి.సునిత ఐదుగురు నిందితులకు జీవితఖైదు మరియు చెరో రూ. 25 వేల ప్రకారం జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఏడుగురి నిందితుల్లో A-6, A- 7 లుగా ఉన్న నల్లబోతుల శివ కృష్ణమూర్తి, బోయ రామాంజినేయులులు అనారోగ్య కారణాలతో కేసు విచారణ సమయంలో చనిపోయారు.

ఈ కేసు సమగ్రంగా దర్యాప్తు చేసిన అప్పటి పామిడి సి.ఐ అశోక్ రెడ్డి, ఫిర్యాదు తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సృజన, కోర్టు కానిస్టేబుల్ ఎం.చంద్రశేఖర్ లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అభినందించారు.