1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
  4. TDP will win, B. Venkanna Challenge

టీడీపీ గెలుస్తుందని తొడగొట్టి ఛాలెంజ్ చేసిన ప్ర‌భుత్వ విప్ బుద్దా

TDP
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు అంతా టీడీపీవైపే నిలిచారని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. గత మూడు ఎన్నికల సందర్భంగా కరెక్టుగా సర్వేలు ఇచ్చిన సంస్థలు ఈసారి ఏపీలో టీడీపీనే అధికారంలోకి రాబోతోందని చెప్పాయని గుర్తు చేశారు. ఎన్టీయే కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని సర్వేలు చేప్పడాన్ని వెంకన్న తప్పుపట్టారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. 
 
సర్వేలతో మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటూ బుద్దా మండిప‌డ్డారు. లగడపాటి సర్వే కూడా కరెక్ట్ కాదు. టీడీపీకి 130 సీట్లు వస్తున్నాయి. మహిళలంతా టీడీపీకే ఓట్లేశారు. 2014లో కూడా వైసీపీ గెలుస్తుందని సర్వేలు ఇచ్చారు. టీడీపీ శ్రేణులు నిరాశ చెందవద్దు. చంద్రబాబు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయోత్సవాలకు సిద్ధంగా ఉండండి అని తెలియ‌చేసారు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
జగన్ మంత్రివర్గ కూర్పు చేసుకున్నారు... కానీ ఏమైంది? చంద్రబాబు జస్ట్ ఆస్కింగ్