హువావేను చంపేసిన గూగుల్.. ఎందుకో తెలుసా?
చైనాకు చెందిన ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ హువావే కంపెనీకి భారీ షాక్ తగిలింది. హువావే టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ ఓఎస్ లైసెన్స్‌ను ఆన్‌లైన్ సెర్చింజన్ గూగుల్ రద్దు చేసింది. హువావే కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే.. హార్డ్‌వేర్ ట్రాన్స్‌ఫర్, సాఫ్ట్‌వేర్, టెక్నికల్ సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
దీంతో హువావే కంపెనీ తయారు చేసే కొత్త స్మార్ట్ ఫోన్ ఫోన్లలోని ప్లే స్టోర్‌లో కొన్ని గూగుల్ యాప్స్‌ను యాక్సస్ అయ్యే అవకాశం కోల్పోనున్నాయి. ఇదే అంశంపై ప్రముఖ రాయిటర్స్ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. హువావే కంపెనీ పబ్లిక్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ఓపెన్ సోర్స్ లైసెన్స్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చునని తెలిపింది.
ఇతర టెక్ కంపెనీలైన ఇంటెల్, క్వాల్‌కామ్న్, జిలింక్స్, బ్రాడ్ కామ్ కంపెనీలు హువావేకు సరఫరా చేసే సాఫ్ట్‌వేర్, ఇతర కంపోనెంట్స్ కూడా నిలిపివేసినట్టు నివేదిక వెల్లడించింది. ఈ టెక్ దిగ్గజాలన్నీ యూఎస్ డిపార్ట్‌మెంట్ నిర్ణయానికి కట్టుబడి తమ సర్వీసులను నిలిపివేసినట్టు తెలిపాయి. చైనా - అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ కొనసాగుతోంది.
ఇందులోభాగంగా, ఇటీవల అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు టెక్ కంపెనీ హువావే టెక్నాలజీస్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. యూఎస్ ప్రభుత్వం నిర్ణయంతో గూగుల్ కూడా హువావే కంపెనీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం.. హువావే ఆండ్రాయిడ్ వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎలాంటి సమస్య లేదు.
కానీ కొత్తఫోన్లకు మాత్రం ఆండ్రాయిడ్ సమస్య ఉత్పన్నంకానుంది. పాత ఫోన్లలో యధావిధిగానే గూగుల్ యాప్స్ నుంచి ఇతర యాప్స్ అప్‌డేట్స్ డౌన్లోడ్ చేసుకోనే వీలుంది. హువావే లైసెన్స్ రద్దు నిర్ణయంతో స్మార్ట్ ఫోన్ కంపెనీ బిజినెస్‌కు చైనా దేశం బయట భారీ ఎఫెక్ట్ పడనుంది.
హువావే ఫోన్లలో రన్ అయ్యే ఫ్యూచర్ ఆండ్రాయిడ్ వెర్షన్.. గూగుల్ సర్వీసుల్లో యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ ప్లే స్టోర్ యాక్సస్ కోల్పోనుంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సస్ తక్షణమే కోల్పోనున్నట్టు నివేదికలు తెలిపాయి. ఆండ్రాయిడ్ లైసెన్స్ రద్దుపై హువావే నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నిర్ణయంతో ప్రపంచ అతిపెద్ద స్మార్ట్ ఫోన్‌ఫోన్ల కంపెనీకి అపారనష్టం వాటిల్లనుంది.