1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 10 feet long python found near busy cottage in tirupati

తిరుమల కాటేజ్ వద్ద పది అడుగుల కొండ చిలువ.. బిత్తరపోయిన జనం

Feet long
తిరుమలలో కొండల్లో లాక్ డౌన్ కారణంగా క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. తాజాగా తిరుమలలో పది అడుగుల పొడవున్న కొండ చిలువ కలకలం సృష్టించింది. భక్తుల సంచారమున్న ప్రాంతంలోనే అది దర్శనమివ్వడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. 
 
జేఈఓ కార్యాలయంకు సమీపంలోని ఎస్ఎంసి కాటేజీ వద్ద చెట్టులోని కొమ్మకు పెనవేసుకొనున్న కొండ చిలువను చూసి భక్తులు బిత్తరపోయారు. దీని గురించి అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
కొండ చిలువను చూసేందుకు యాత్రికులు తరలివచ్చి... తమ ఫోన్లలో ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
భర్త కరోనాతో ఆసుపత్రిలో, సాయం చేస్తానంటూ అతడి భార్యను లొంగదీసుకున్న భర్త ఫ్రెండ్