శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (11:56 IST)

నెమలిని మింగేసిన కొండచిలువ... ఎక్కడ?

కొండచిలువలు ఆహారాన్ని సులభంగా మింగేస్తాయి. తాజాగా హర్యానాలో ఓ కొండ చిలువ నెమలిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో 15అడుగుల కొండచిలువ.. నెమలిని ఆహారంలో తీసుకుని మింగేసింది. 
 
ఝాండా గ్రామస్థులు అటవీ ప్రాంతంలో కొండచిలువను మింగేయడం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలియజేశారు. వాళ్లు వచ్చే సమయానికి కొండచిలువ నెమలిని పూర్తిగా మింగేసి.. అడవిలోకి పారిపోయింది.
 
దాని పొడవు 15అడుగులు ఉన్నట్లు గుర్తించగలిగారు. అలాహే గుజరాత్‌ లోని వడోదరా జిల్లాలో తొమ్మిది అడుగుల పాము పిల్లిని మింగేసింది. గతేడాది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ మొసలిని మింగి ఆకలి తీర్చుకున్న సంగతి తెలిసిందే.