1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Kerala : 60-yr-old Kerala woman rescues live python from Kochi Naval colony

బుసలు కొడుతున్న కొండ చిలువను బంధించిన మహిళ - వీడియో వైరల్

Kerala
సాధారణంగా చిన్న పామును చూస్తేనే వణికిపోతాం. ఆ పాము నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు భయంతో వణికిపోతూ పారిపోతుంటాం. అలాంటింది ఆ మహిళ మాత్రం ఎంతో ధైర్యంతో బుసలు కొట్టే కొండ చిలువను బంధించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొచ్చికి చెందిన విద్యా రాజు(60) నివాసంలోని ఓ చెట్టు వద్ద కొండచిలువ కనిపించింది. దీంతో దాన్ని ఎలాగైనా బంధించాలని విద్యా రాజు నిర్ణయించుకుంది. పాములు పట్టడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉండడంతో ఈ కొండచిలువను పట్టేందుకు పెద్ద కష్టం కాలేదు.
 
ఇక ముగ్గురు పురుషులు, ఒక యువతి కొండ చిలువ తోకను పట్టుకున్నారు. తల భాగాన్ని విద్యారాజు అదిమిపట్టి 20 కేజీల బరువున్న కొండ చిలువను కదలనివ్వకుండా పట్టుకుంది. ఆ తర్వాత ఓ సంచిలో వేసి మూటగట్టింది. 
 
అనంతరం ఆ పైథాన్‌ను స్థానిక అడవుల్లో వదిలేసింది. 2002 నుంచి విద్యారాజు పాములను పడుతున్నారు. వన్యప్రాణులను రక్షిస్తున్నారు. ఈమె భర్త ఇండియన్‌ నేవీలో సీనియర్‌ ఆఫీసర్‌. విద్యారాజు కొండచిలువను బంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఈశాన్యంలో అశాంతి.. జపాన్ ప్రధాని టూర్ రద్దు.. మమత ఫైర్