శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2019 (20:25 IST)

గుడ్, మంచి పని చేశావ్, ఎస్సైకి సీఎం జగన్ ప్రశంసలు-Video

విజయవాడ బందరు కాలువలో ఆత్మహత్యా యత్నం చేసిస మహిళను కాపాడిన రిజర్వ్ సబ్‌ ఇన్స్పెక్టర్ ఆఫ్‌ పోలీసు అర్జునరావును సీఎం శ్రీ వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అభినందించారు.
కృష్ణలంకలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బందరు కాలువలో డి.లక్ష్మి త్మహత్యాయత్నం చేసింది.
 
ప్రవాహంలో కొట్టుకుపోతున్న లక్ష్మిని కాలువలో దూకి అర్జునరావు రక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ కాన్వాయ్‌ పైలెట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌, అర్జునరావు సాహసాన్ని ప్రశంసించారు. 
 
ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.