రేపటి నుంచి అమ్మఒడి వెరిఫికేషన్...  
                                       
                  
                  				  అమ్మఒడి క్షేత్రస్థాయి పరిశీలన సోమవారం నుంచి జరగనుంది. ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్ అందజేసిన వివరాలను ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)లు పరిశీలించి వైబ్‌సైట్‌లో శనివారం నాటికి పొందుపరిచారు.
				  											
																													
									  విద్యార్థి, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, రేషన్ కార్డు వంటి అంశాలను హెచ్‌ఎంలు పరిశీలించారు. తెల్ల రేషన్ కార్డు లేని, ఆదాయ పరిమితి మించిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులు రిజెక్టు లిస్టులో పెట్టారు. 
				  
	 
	హెచ్‌ఎంలు పరిశీలించిన సమాచారం వెబ్‌సైట్ ద్వారా మండల విద్యాశాఖ అధికారు(ఎంఇవో)లకు చేరుతుంది. ఎంఇవోలు గ్రామ సచివాలయ విద్య, సంక్షేమ శాఖ అధికారులకు పంపుతారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  అక్కడి నుంచి గ్రామ వాలంటీర్లు రిజెక్ట్ లిస్ట్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబాలతో పాటు, మిగిలిన కుటుంబాలకు వెళ్లి పరిశీలన చేస్తారు. అనంతరం ఆ సమాచారాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది వెబ్‌సైట్ ద్వారా ఎంఇవోలకు అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఎంఇఓలు ఈ నెల 5లోపు జరపాల్సి ఉంటుంది.